
జనరల్

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఏఐ సాంకేతికత వినియోగంపై కీలక హెచ్చరిక చేశారు. వ్యాపార సంస్థలు శక్తివంతమైన ఏఐ మోడళ్ల సేవలు పొందడానికి భారీగా ఖర్చు చేస్తూనే, తమ సొంత విలువైన సమాచారాన్ని వాటికి అందిస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యను ఆయన ‘రివర్స్ ఇన్ఫర్మేషన్ పారడాక్స్’గా అభివర్ణిస్తూ, వినియోగదారులు తమ సమాచారాన్ని వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
ఏఐ మోడళ్లు వినియోగదారుల ప్రాంప్ట్‌లు, సవరణలు, టూల్స్ ద్వారా నిరంతరం నేర్చుకుంటూ తమ మేధను పెంచుకుంటున్నాయని, అయితే ఆ డేటా వినియోగంపై స్పష్టత లేకపోవడం సమస్యగా మారిందన్నారు. సృష్టించిన జ్ఞానంపై యాజమాన్యం వినియోగదారులకే ఉండాలని, సంస్థలు తమ క్లౌడ్ పరిధిలోనే సురక్షిత అభ్యాస వాతావరణాలను నిర్మించుకోవాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!