
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ కానున్నారు. రానున్న వారం నుంచి పది రోజుల్లో ఈ కీలక సమావేశం జరగనున్నట్లు మహారాష్ట్ర నీటిపారుదల సలహాదారు వెదిరె శ్రీరాం తెలిపారు. ఈ సమావేశంలో గోదావరి జలాల వినియోగం, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాలు, ముఖ్యంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుతో మహారాష్ట్రకు ముంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫడణవీస్‌కు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నీటి అవసరాలు తీరనున్నాయి. అలాగే గోదావరి జలాల మళ్లింపు, ప్రాజెక్టు కోసం అవసరమైన దాదాపు 2 వేల ఎకరాల భూసేకరణ అంశాలపై కూడా ఈ భేటీలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!