

ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (క్యూ1) బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ రూ.5,641.52 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.4,427.94 కోట్ల లాభంతో పోలిస్తే 27.5 శాతం వృద్ధిని సాధించింది. వడ్డీ ఆదాయం పెరగడం, మార్జిన్లు మెరుగుపడటం, ఆస్తుల నాణ్యత పెరగడం ఈ వృద్ధికి కారణమని బ్యాంక్ తెలిపింది.
ఈ క్యూ1లో యూబీఐ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 1.05 శాతం పెరిగి రూ.27,203 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 2.80 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో మార్జిన్లు మరింత మెరుగుపడతాయని యూబీఐ ఎండీ, సీఈఓ ఆశీష్ పాండే తెలిపారు. ఆర్‌బీఐ ఎఫ్‌సీఎన్‌ఆర్ బీ ప్రత్యేక విండో ద్వారా ఇప్పటివరకు 10.6 కోట్ల డాలర్ల డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ నాటికి 150-200 కోట్ల డాలర్ల డిపాజిట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!