

మధ్యప్రదేశ్‌లో అమలు చేయనున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా కమిటీ తన తుది నివేదికలో సహజీవన (లివ్-ఇన్) బంధాలకు సంబంధించి పలు కీలక నిబంధనలను ప్రతిపాదించింది. ముసాయిదా ప్రకారం లివ్-ఇన్ బంధంలోకి ప్రవేశించే జంటలు తమ పరిధిలోని జిల్లా రిజిస్ట్రార్ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. బంధం ముగిసిన తర్వాత అధికారికంగా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ బిల్లును త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ముసాయిదా ప్రకారం లివ్-ఇన్ జంటలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి పోలీస్ స్టేషన్‌లో లివ్-ఇన్ జంటల వివరాలు నమోదు చేయాలని, అవసరమైతే పొరుగువారు లేదా ఇంటి యజమాని కూడా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొంది. భాగస్వామిని పురుషుడు విడిచిపెడితే మహిళకు భరణం చెల్లించాలని ప్రతిపాదించింది. అలాగే వారసత్వ చట్టాల్లో మార్పులు సూచిస్తూ, మరణించిన వ్యక్తి ఆస్తిపై భార్య, పిల్లలు, తల్లి, తండ్రికి సమాన హక్కులు కల్పించాలని సిఫార్సు చేసింది. తొలి దశలో ఈ చట్టం గిరిజనులకు వర్తించదని కమిటీ పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!