

యూరోపియన్ యూనియన్ (ఈయూ) పిల్లల సోషల్ మీడియా వినియోగంపై మరింత కఠిన నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఆన్‌లైన్ బాలల భద్రతపై అధ్యయనం చేసిన ప్రత్యేక కమిటీ, 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించాలని సిఫార్సు చేసింది. టెక్ కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలకు సురక్షితమని నిరూపించే వరకు వారికి యాక్సెస్ ఇవ్వకూడదని కమిటీ సూచించింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మూడేళ్లలోపు పిల్లలు ఎలాంటి స్క్రీన్‌లను ఉపయోగించకూడదని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా భద్రతను నిరూపించే బాధ్యత టెక్ సంస్థలదేనని కమిటీ స్పష్టం చేసింది. అలాగే 13 ఏళ్లు దాటిన పిల్లల విషయంలో కూడా అదనపు వయోపరిమితులను పరిశీలించాలని సభ్య దేశాలకు సూచించింది. అంతులేని స్క్రోలింగ్ (Infinite Scrolling) వంటి ఫీచర్లు పిల్లల్లో వ్యసనానికి దారితీస్తున్నాయని వాన్ డెర్ లేయెన్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదా మద్యం కొనుగోలుకు వయోపరిమితి ఉన్నట్లే, సోషల్ మీడియా వినియోగానికీ చట్టబద్ధమైన వయోపరిమితి అవసరమని ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!