
సినిమాలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఆరు కంపార్టుమెంట్లలో టైంస్లాట్ దర్శనం భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లుగా నమోదైంది. మంగళవారం 75,485 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 30,939 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!