

ఎంబీబీఎస్ చదివి వైద్య సేవలు అందించాలని ఆశించే విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) శుభవార్త అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల అధికారిక సీట్ మ్యాట్రిక్స్‌ను మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (మార్బ్) విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు కొత్తగా 810 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 9,440 నుంచి 10,250కు పెరిగింది.
తెలంగాణలో ప్రస్తుతం 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలకు 110 సీట్లు పెరగడంతో ప్రభుత్వ రంగంలో మొత్తం సీట్లు 4,410కు చేరాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు 700 కొత్త సీట్లు మంజూరు కావడంతో ప్రైవేట్ రంగంలో మొత్తం సీట్లు 5,850కు పెరిగాయి. దేశవ్యాప్తంగా 9,911 ఎంబీబీఎస్ సీట్లు పెంచడంతో మొత్తం సీట్ల సంఖ్య 1,36,939కు చేరింది. అనుమతించిన సీట్లకు మించి అడ్మిషన్లు చేయరాదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!