

గూగుల్ భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లకు జెమినీ ఇన్ క్రోమ్‌ను విస్తరించింది. ఈ ఏఐ అసిస్టెంట్ నేరుగా క్రోమ్ బ్రౌజర్‌లోనే పనిచేస్తుంది. దీంతో యూజర్లు తాము చూస్తున్న వెబ్‌పేజీని వదిలి మరో యాప్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పొడవైన ఆర్టికల్స్‌ను సంక్షిప్తంగా వివరించడం, వెబ్‌పేజీలోని సమాచారంపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, గూగుల్ కీప్, క్యాలెండర్ వంటి సేవలతో పని చేయడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
ఇక గూగుల్‌కు చెందిన నానో బనానా ఏఐ మోడల్‌ను ఉపయోగించి బ్రౌజింగ్ సమయంలోనే చిత్రాలను రూపొందించడం లేదా ఎడిట్ చేయడం కూడా చేయవచ్చు. మరో కీలక ఫీచర్ అయిన ఆటో బ్రౌజ్‌ను భారత్‌లో డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ఏఐ ప్రో, గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. పార్కింగ్ బుక్ చేయడం, పొడవైన ఫారమ్‌లు నింపడం, కిరాణా సరుకులు ఆర్డర్ చేయడం వంటి కొన్ని బహుళ దశల పనులను ఆటో బ్రౌజ్ నిర్వహించగలదు. ప్రాంప్ట్ ఇంజెక్షన్ వంటి ప్రమాదాలను గుర్తించే రక్షణ వ్యవస్థలు ఇందులో ఉన్నాయని గూగుల్ తెలిపింది. సున్నితమైన పనులను కొనసాగించే ముందు కొన్ని సందర్భాల్లో యూజర్ అనుమతిని కూడా కోరుతుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!