22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

Writer: Chandrika 08:49 PM, 22 నవంబర్, 2026
కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

నాగచైతన్య కథానాయకుడిగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’ డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ప్రారంభంలో మంచి అవకాశం లభించినా, పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రతిభ, కష్టమే ముఖ్యమని అన్నారు. ఫేక్ పీఆర్‌, మార్కెటింగ్‌ ఎక్కువ కాలం పనిచేయవని, సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే మౌత్ టాక్‌ మాత్రమే అసలైన బలమని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు పూర్తయినా నటుడిగా ఇంకా ఎన్నో సాధించాలనే తపన ఉందని, ఎలాంటి పాత్రనైనా చేయగలడనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించాలని ఉందని చెప్పారు. అనుకున్నట్లు పరిస్థితులు లేకపోయినా వాటిని చక్కదిద్దుతూ ముందుకు వెళ్లే గుణం శోభితలో తనకు బాగా నచ్చుతుందని, తన ఫ్యాషన్‌, వార్డ్‌రోబ్‌లో వచ్చిన మార్పులకు ఆమెనే కారణమని తెలిపారు.

ప్రేమ గురించి మాట్లాడుతూ.. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేమని, అందుకే అదొక అందమైన అనుభూతిగా మిగిలిపోతుందని నాగచైతన్య అన్నారు. టీనేజ్‌లో ప్రేమను ఒత్తిడిగా భావించకుండా ఆస్వాదించాలని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని యువతకు సూచించారు. తాతయ్య రామానాయుడు నిర్మాణంలో ఒక్క సినిమా కూడా చేయలేకపోయానన్న వెలితి ఉందని, ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలను ఆయన చూడగలిగితే బాగుండేదని భావోద్వేగంగా చెప్పారు. ఏఎన్నార్‌తో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతి అని, అఖిల్‌తో తన అనుబంధం అన్నదమ్ముల కంటే స్నేహితుల్లాంటిదని పేర్కొన్నారు. ‘వృషకర్మ’ అద్భుతమైన థ్రిల్లర్‌గా ఉండబోతోందని, దాదాపు ప్రతి ఫ్రేమ్‌లోనూ వీఎఫ్ఎక్స్ ఉంటాయని, జెన్‌ జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించాలని, తన సినీ ప్రయాణం ముగిసేలోపు హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్‌తో పనిచేయాలన్నది తన కల అని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

భారీ చిత్రాలపై ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ గురి?

ట్యాగ్లు
నాగచైతన్యవృషకర్మశోభితకార్తీక్ దండుతెలుగు సినిమారామానాయుడుఅఖిల్ అక్కినేనిసందీప్ రెడ్డి వంగాక్రిస్టఫర్ నోలన్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..
జనరల్

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!