

బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి కేవలం రెండు రోజులకే రూ.15 లక్షల సూట్‌కేస్‌తో బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంతో కంటెస్టెంట్ బయటకు రావడం ఇదే తొలిసారి అని చర్చ జరుగుతోంది. రెండు రోజుల్లోనే రూ.15 లక్షలు తీసుకోవడాన్ని కొందరు ప్రేక్షకులు ప్రశంసిస్తుండగా, మరికొందరు డబ్బు కోసమే షోలోకి వచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో మిథిలేష్ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మిథిలేష్ తన అనుభవాలను పంచుకుంటున్నారు. గత సీజన్ కంటెస్టెంట్ డెమోన్ పవన్ వ్యూహాన్ని అనుసరించారా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన, బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు పవన్‌ను కలిసిన మాట నిజమేనని చెప్పారు. అయితే, చివరి వరకు హౌస్‌లో ఉండి అద్భుతంగా ఆడాలని పవన్ సలహా ఇచ్చారని, రూ.15 లక్షలు తీసుకుని బయటకు రావాలని మాత్రం చెప్పలేదని స్పష్టం చేశారు. సూట్‌కేస్ తీసుకోవడం పూర్తిగా తన సొంత నిర్ణయమని తెలిపారు. రూ.15 లక్షల నుంచి ట్యాక్స్‌లు, ఇతర కటింగ్స్ పోయిన తర్వాత తన చేతికి సుమారు రూ.10 లక్షలు మిగులుతాయని వెల్లడించారు. బిగ్‌బాస్‌లోకి తాను ప్రధానంగా గుర్తింపు కోసం వెళ్లానని, రెండు రోజుల్లోనే తనకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందని భావించి సూట్‌కేస్‌తో బయటకు వచ్చినట్లు మిథిలేష్ తెలిపారు.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!