

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదకొండో వారం పరిణామాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. డిక్టేటర్స్ టాస్క్‌లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్ చైత్రా రాయ్.. వంశీని నామినేట్ చేసింది. వంశీ, త్రిగుణ్ గురించి వెనుక మాట్లాడుతున్నారని, వంశీ త్రిగుణ్ చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిగుణ్ ఆటతీరును విమర్శిస్తూ రోహిత్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అందులో చైత్రా రాయ్‌ను ట్యాగ్ చేయడంతో ఆమె ఆ పోస్టును తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీషేర్ చేసింది. అయితే అందులోని వ్యాఖ్యలపై త్రిగుణ్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె వెంటనే ఆ స్టోరీని తొలగించింది.
రీషేర్ చేసిన పోస్టులో రోహిత్, చరణ్, షాలినీ, చైత్రా రాయ్ సహా ఐదుగురు కంటెస్టెంట్లు త్రిగుణ్ ఆటతీరు వల్ల ప్రభావితమయ్యారని పేర్కొన్నట్లు సమాచారం. ఈ పోస్టుపై త్రిగుణ్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైత్రను ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఆమె.. తనను ట్యాగ్ చేసిన పోస్టును మాత్రమే రీషేర్ చేశానని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది. విషయం అర్థమైన వెంటనే పోస్టును తొలగించానని తెలిపింది. త్రిగుణ్‌పై తనకు గౌరవం ఉందని, ఆయన ఆటతీరును ఎప్పుడూ అభినందిస్తానని చెప్పింది. తన ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చైత్రా రాయ్ వివరణ ఇచ్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!