
సినిమాలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి ప్రోమోలో రామ్‌ప్రసాద్, నరేశ్ తమ కామెడీతో హౌస్‌లో సందడి చేశారు. ఇప్పటికే పూర్తయిన ఫ్యామిలీ వీక్‌లో దేబ్జానీ, నీతూ మాస్టర్ తమ కుటుంబ సభ్యులను చూసినప్పుడు ఎలా స్పందించారో గుర్తుచేసుకుంటూ సరదాగా అనుకరించారు. వారి రియాక్షన్లను తమదైన శైలిలో చూపిస్తూ నవ్వులు పూయించారు. దీంతో హౌస్‌లో కాసేపు సరదా వాతావరణం నెలకొంది.
అయితే ఈ కామెడీ మధ్యలో ఒక్కసారిగా సైరన్ మోగడంతో పరిస్థితి మారిపోయింది. కొంతమంది వ్యక్తులు హౌస్‌లోకి ప్రవేశించి కంటెస్టెంట్లకు ఉన్న కొన్ని పవర్స్‌ను తీసుకెళ్లారు. అనంతరం ‘ఎక్స్పైరీ డేట్ దాటిందా?’ అంటూ ఓ నోట్‌ను వదిలారు. ఈ అనూహ్య పరిణామం కంటెస్టెంట్లలో ఆసక్తిని పెంచింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!