
జనరల్

తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన విజయ్‌ను ‘డమ్మీ సీఎం’గా అభివర్ణించారు. మార్పు, అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి మార్పు తీసుకురాలేదని ఆరోపించారు.
గత డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కేవలం పేర్లు మార్చి, వాటిపై తమ స్టిక్కర్లు వేసుకుని టీవీకే ప్రభుత్వం ఘనతను చాటుకుంటోందని ఉదయనిధి ఆరోపించారు. పాలనలో చెప్పుకోదగ్గ మార్పు ఏదీ లేదని, కేవలం పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడమే జరుగుతోందని విమర్శించారు. డీఎంకే, టీవీకే మధ్య రాజకీయ విభేదాలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఉదయనిధి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!