
సినిమాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిను తెరుస్తారా లేక తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారా అంటూ ట్రంప్ ప్రశ్నించారు. తన సహనాన్ని కోల్పోయినట్లు తెలిపిన ఆయన, అవసరమైతే ఇరాన్‌పై దాడులకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
మంగళవారం చేసిన సోషల్ మీడియా పోస్టులో “పవర్ ప్లాంట్, బ్రిడ్జ్ డే” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ, నరకానికి పోతారని శాపనార్థాలు చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కీలక దశను సూచిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!