
సినిమాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బైకర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో రూపొందిందని, దాని గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని పేర్కొన్నారు.
తన ట్వీట్‌లో యూవీ క్రియేషన్స్పై ప్రశంసలు కురిపిస్తూ, ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించారని కొనియాడారు. తన స్నేహితుడు శర్వానంద్కు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే రాజశేఖర్ పాత్రకు వస్తున్న స్పందనపై సంతోషం తెలిపారు. దర్శకుడు అభిలాష్ కంకర చేసిన ప్రత్యేక ప్రయత్నాన్ని అభినందిస్తూ, నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్‌తో పాటు మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాను త్వరలోనే చూడాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!