

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా (సుకుమార్ శిష్యుడు) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సృష్టించింది. తాజాగా ఈ సినిమా బిజినెస్‌పై ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో స్వయంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇతర డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ, సినిమాపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నైజాం థియేట్రికల్ హక్కుల విలువ సుమారు రూ.63 కోట్లుగా అంచనా వేస్తున్నారు. టికెట్ ధరల పెంపు అనుమతి లేకపోతే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సవాల్‌గా మారవచ్చు. అయితే మంచి టాక్ వస్తే ఇది సాధ్యమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. రామ్ చరణ్ మొదటిసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తుండగా, సంగీతం ఏ. ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!