

లెబనాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్వయంగా ఫోన్ చేసి బీరుట్‌పై భారీ దాడులు చేయవద్దని హెచ్చరించినట్లు తెలిపారు. తాను జోక్యం చేసుకోకపోతే నెతన్యాహు జైల్లో ఉండేవారని కూడా పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ఆయన, “బీబీ” అని పిలుస్తూ తన సూచనలను వినడంతో ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి తగ్గాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాడీవేడి సంభాషణ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరగడానికి నెతన్యాహు చర్యలే కారణమని ట్రంప్ తీవ్రంగా విమర్శించినట్లు సమాచారం.
ఇక మధ్యవర్తుల ద్వారా హెజ్‌బొల్లా నేతలతో కూడా చర్చలు జరిపినట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్‌పై అన్ని రకాల దాడులను నిలిపివేయడానికి వారు అంగీకరించారని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, లెబనాన్‌పై దాడులు కొనసాగితే వాషింగ్టన్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఇరాన్‌తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ట్రంప్ మరో పోస్టులో వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!