
జనరల్

ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ పండుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని లోడగలవానిపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పండు మాస్టర్‌కు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!