
జనరల్

దర్శకుడు నుంచి నిర్మాతగా మారిన వేణు ఊడుగుల తన తొలి నిర్మాణ చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’తో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాణంలో మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సంధ్య భాను చల్లా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నదని వేణు ఊడుగుల తెలిపారు. తెలంగాణలోని జమ్మికుంట అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ గ్రామ భవిష్యత్తును ఎలా మార్చిందనే అంశం ప్రధానంగా ఉంటుంది. రామాయణంలోని రామ-లక్ష్మణుల ఐక్యతకు విరుద్ధంగా, మహాభారతంలోని సోదరుల విభేదాలను ప్రతిబింబిస్తూ ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!