

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఓవర్సీస్లో జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే టికెట్లు వేగంగా అమ్ముడవుతుండటంతో సినిమా విడుదలకు ముందే 1 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్‌కు ప్రీమియర్స్ ద్వారానే వన్ మిలియన్ క్లబ్లో చేరిన చిత్రంగా పెద్ది నిలిచింది. మరోవైపు చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, పెద్ది పాత్ర కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. కుస్తీ సన్నివేశాల్లో గాయాలు అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా నటించారని ప్రశంసించారు. చిత్రీకరణ సమయంలో కంటికి గాయం అయిన ఘటన తనను ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!