

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు ఆకస్మిక వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తిరువూరు బస్టాండ్ పరిసరాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.
మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇటీవల 40 డిగ్రీల వరకు నమోదైన వేడి ఇప్పుడు కొంత తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. గత వారం రోజులుగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా, మరో రెండు రోజుల పాటు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!