
క్రీడలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ చిత్రాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనుల్లో ఉంది. సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, ఆయన 173వ సినిమా పూర్వ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి యువ దర్శకుడు అశ్వత్ మారిమూత్తు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల పూర్తి స్క్రిప్ట్‌ను రజనీకాంత్‌కు వినిపించగా, ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం చెన్నైలోని పూనమల్లిలో భారీ సెట్ నిర్మాణం కొనసాగుతోంది. ఈ పనులు పూర్తైన వెంటనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!