

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కొత్త కారును సంస్థ ఆవిష్కరించనుంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది దేశంలోనే తొలి వంద శాతం ఇథనాల్ ఆధారిత సౌకర్యవంతమైన ఇంధన కారు కానుంది. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఈ అడుగు కీలకంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ వాటాను 30 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాల వల్ల పెట్రోల్‌తో పోలిస్తే ఇంధన వ్యయం 25 నుంచి 35 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వాహన పరికరాల తయారీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!