

దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను మరింత వాస్తవికంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో టోకు ధరల సూచీని దశలవారీగా నిలిపివేసి, దాని స్థానంలో మరింత సమగ్రమైన ఉత్పత్తిదారుల ధరల సూచీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
కొత్త వ్యవస్థలో ఉత్పత్తి ధరలు, ఉత్పాదనలో ఉపయోగించే వస్తువుల ధరలు, అలాగే సేవల ధరలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. దీనివల్ల ధరల మార్పులను మరింత విస్తృతంగా, ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు. పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం ఈ నెల 15న 2022–23 ఆధార సంవత్సరంతో సవరించిన టోకు ధరల సూచీని విడుదల చేయనుంది.
అదే రోజున కొత్త ఉత్పత్తిదారుల ధరల సూచీని కూడా విడుదల చేయనున్నారు. ఇందులో ఉత్పత్తి ఆధారిత సూచీ, ప్రయోగాత్మక ఉత్పాదన ఇన్‌పుట్ సూచీ, సేవల సూచీ ఉంటాయి. సేవల విభాగంలో బ్యాంకింగ్, సెక్యూరిటీల లావాదేవీలు, బీమా, పెన్షన్ నిధుల నిర్వహణ, రైల్వేలు, ప్రయాణికుల విమానయానం, టెలికం వంటి రంగాలు మొదట చేర్చబడతాయి. తర్వాత మరిన్ని సేవలను ఇందులో జత చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!