
టెక్నాలజీ

పశ్చిమ బెంగాల్‌లో భాజపా చరిత్రాత్మక విజయానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఐదుగురు కీలక నేతలు వ్యూహాత్మకంగా పనిచేశారు. అమిత్ షా 14 రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేశారు. రోజంతా ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహిస్తూ, రాత్రుళ్లు పార్టీ నేతలతో సమావేశాలు జరిపారు. ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు హామీ ఇవ్వడం, చొరబాట్లను అడ్డుకోవడం వంటి అంశాలపై ప్రచారం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ ప్రచార వ్యూహకర్తగా కీలక పాత్ర పోషించగా, భూపేందర్ యాదవ్ క్షేత్రస్థాయి కార్యకలాపాలను పర్యవేక్షించారు. సునీల్ బన్సల్ బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయగా, బిప్లవ్ దేవ్ ప్రాంతీయ ప్రచారాన్ని ఉత్సాహపరిచారు. డిజిటల్ ప్రచార బాధ్యతలను అమిత్ మాలవీయ నేతృత్వంలోని ఐటీ విభాగం నిర్వహించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!