

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాలతో కూడుకున్నవని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజాధనంతో సభలు నిర్వహించి కేసీఆర్, హరీశ్‌రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను సీఎం ప్రస్తావించలేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ ఇంటింటికీ తాగునీరు అందించారని, ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని ఆరోపించారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతుభరోసా, రుణమాఫీ, విద్యుత్, నిరుద్యోగం వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.
రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం వంటి హామీలపై ఆమె ప్రశ్నలు సంధించారు. హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ‘క్షుద్ర పూజలు’ ఆరోపణలను కూడా ఆమె తప్పుబట్టారు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. సంగారెడ్డికి వచ్చిన సీఎం వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప జిల్లాకు కొత్తగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రస్తుత సీట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!