

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడంపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు కూడా జగన్ ఆసక్తి చూపలేదని అప్పలనాయుడు ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న 84 ఏళ్ల సీతారావమ్మ జాతీయ జెండా పట్టుకుని దేశభక్తిని చాటారని, ఆమెను చూసైనా జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్‌కు తగిన సమాధానం చెబుతారని అన్నారు.
జగన్‌కు ఇతర కార్యక్రమాలకు సమయం ఉంటుందని, కానీ దేశభక్తిని చాటే కార్యక్రమాలకు మాత్రం ఆసక్తి లేదని పంచుమర్తి అనురాధ విమర్శించారు. రౌడీలు, గంజాయి కేసుల్లో ఉన్నవారిని పరామర్శించేందుకు సమయం కేటాయించే జగన్‌కు జాతీయ జెండా ఎగురవేయడానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా నుంచి స్పందన రావాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!