.png&w=3840&q=75)

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో తిరస్కరించబడింది. రెండ్రోజుల పాటు జరిగిన చర్చ అనంతరం బుధవారం సాయంత్రం నిర్వహించిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో సభ ఈ తీర్మానాన్ని కొట్టివేసింది. ఈ సందర్భంగా సభలో తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించాయి.
చర్చలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ సభలో ముఖ్యమైన అంశాలు లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం, లద్దాఖ్ సంక్షోభం వంటి కీలక అంశాలపై మాట్లాడనివ్వలేదని ఆరోపించారు. దీనికి సమాధానంగా అమిత్ షా మాట్లాడుతూ స్పీకర్‌పై అనుమానం వ్యక్తం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని, పార్లమెంట్ తన నియమాల ప్రకారం నడుస్తుందని తెలిపారు. చివరకు అవిశ్వాస తీర్మానం విఫలమవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.

.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!