29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం

Writer: Nithish 12:35 PM, 29 జులై, 2026
కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం

పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పొలాలు పాడిపంటలతో కళకళలాడాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురు పూర్ణిమ రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందన్నారు. మహంకాళి బోనాలు, లాల్‌దర్వాజా, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న వంటి ఆలయాలు ప్రజలకు ధైర్యం, భరోసా కలిగించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు విస్తరించాలని కోరుకున్నారు. తనకు వ్యక్తిగత కోరికలు ఏవీ లేవని, ప్రజల సంక్షేమం, లోకకళ్యాణమే తన సంకల్పమని మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్

ఝార్ఖండ్‌లో టాప్ మావోయిస్టు అరెస్ట్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

హైటెక్‌ సిటీలో హైడ్రాకు మద్దతుగా ర్యాలీ

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారు

ట్యాగ్లు
పొన్నం ప్రభాకర్గురు పూర్ణిమకొండగట్టు ఆలయంగిరి ప్రదక్షిణతెలంగాణఆంజనేయ స్వామిజగిత్యాలప్రత్యేక పూజలుఆధ్యాత్మిక వార్తలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్థాన్ బలగాల కాల్పులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామన్వెల్త్‌లో భారత్ జోరు..
క్రీడలు

కామన్వెల్త్‌లో భారత్ జోరు..

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు...ఇక టోకెన్ తప్పనిసరి
బిజినెస్

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు...ఇక టోకెన్ తప్పనిసరి

ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

ఓవర్సీస్ డీల్‌తో ‘రోమాంచకం’పై అంచనాలు పెరుగుదల

బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..
సినిమాలు

బెంగళూరులో గ్రాండ్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్..

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..
షోస్

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!
సినిమాలు

'కాంతార' హీరోకు గ్లోబల్ గుర్తింపు.. ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ
సినిమాలు

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ

హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్..
రాజకీయాలు

హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కౌంటర్..

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్
జనరల్

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు
జనరల్

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..
జనరల్

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!