
జనరల్

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో నిరసనలను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పూంచ్ డివిజన్‌లోని 13 పాఠశాలల గుర్తింపును రద్దు చేయడంతో పాటు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతల ఆస్తులను స్వాధీనం చేసుకుని, పలు వ్యాపార సంస్థలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే జేఏఏసీ నేతలు, నిరసనకారుల పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
మరోవైపు, నిరసనలకు సంబంధించిన వార్తలను కవర్ చేస్తున్న కొందరు జర్నలిస్టుల బ్యాంక్ ఖాతాలను సైతం ఫ్రీజ్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అదనంగా, పాక్ ప్రభుత్వం సుమారు 500 మందిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ చర్యలపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!