
జనరల్

మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్-1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని కంపెనీలు, సంస్థలు ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ఉత్పాదకత కొనసాగింపు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేలా ఈ సూచనలు జారీ చేసినట్లు తెలిపింది.
ఈ మేరకు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి విడతలవారీగా ముందస్తు లాగౌట్ అమలు చేయాలని సంస్థలను ట్రాఫిక్ పోలీసులు కోరారు. అలాగే తమ సంస్థ ఉన్న ప్రాంతం, ఉద్యోగులకు ఇవ్వనున్న ముందస్తు లాగౌట్ సమయాన్ని ట్రాఫిక్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ముందస్తు సమన్వయంతో రహదారులపై ఒత్తిడి తగ్గి, భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!