
జనరల్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై జరిగిన “క్రూరమైన దాడికి” కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన లేఖ రాశారు. నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాహుల్, దీనికి అనుమతి ఎవరు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
జూలై 20న విద్యార్థులు న్యాయబద్ధమైన విద్యా వ్యవస్థ కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టారని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది భాష్పవాయువు, పెల్లెట్ గన్లు ఉపయోగించి అధిక బలప్రయోగం చేశారని ఆరోపించారు. విద్యార్థులపై లాఠీ దాడి చేసిన వారిని, వారిని పంపిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రాహుల్ లేఖపై కేంద్ర హోంశాఖ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!