
సినిమాలు

ఓటుకు నోటు కేసు విచారణను సీజేఐ ధర్మాసనం మరో 10 రోజులకు వాయిదా వేసింది. ఈ కేసును ఎన్నికల నియమావళి కింద విచారించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ సండ్ర వెంకట వీరయ్య కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ఇప్పటికే తన వాదనలు పూర్తి చేశారు.
ఇక ప్రతివాదులుగా ఉన్న బీఆర్ఎస్ తరఫున వాదనలు కొనసాగాల్సి ఉంది. అయితే ఈరోజు ఆ వాదనలు వినేందుకు సీజేఐ ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. దీంతో తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!