

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ సమగ్రత, సమైక్యత, ఐక్యత కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకురాలిగా ఆమెను కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన ప్రజా నాయకురాలని పేర్కొన్నారు. దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న నాయకురాలిగా ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు.
బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల కార్యక్రమం వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఆమె అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని సీఎం తెలిపారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం, అభివృద్ధి ఫలాలను బలహీన వర్గాలకు అందించడం ఆమె పాలనలో ముఖ్యమైన లక్ష్యాలని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ విధానాలు నేటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె చూపిన మార్గం, సంక్షేమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!