

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం, మండల, జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం రేపటి నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. అదే రోజు మండల పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక జరగనుంది. కోఆప్టెడ్ సభ్యుల పదవీకాలం కూడా ఐదేళ్లుగా ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు.
ఇక జెడ్పీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం నవంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు చేపట్టనున్నారు. మండల, జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాల తేదీలతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!