
జనరల్

ఆంధ్రప్రదేశ్లో జడ్పీ చైర్మన్, చైర్పర్సన్ పదవుల పంపిణీపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పదవుల కేటాయింపుపై చర్చలు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు.
నేడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూటమి నేతల చర్చలు కొనసాగనున్నాయి. జనసేన, బీజేపీలకు ఏయే ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్ పదవులు కేటాయించాలనే అంశంపై టీడీపీ అధిష్ఠానం తన ప్రతిపాదనలను ఇప్పటికే వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు, కొన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడనున్నారు. ఈ చర్చల అనంతరం పదవుల పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!