
జనరల్

కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని శివప్రతాప్ శుక్లాను కోరినట్లు తెలిపారు. లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వెలుగుమట్లతో పాటు వికారాబాద్ జిల్లా కడ్లాపూర్ మరియు ట్రిపుల్ ఆర్ బాధితులతో కలిసి ఈ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బాధితుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.
వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని, కడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు వంటి సమస్యలపై కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరగకపోతే మళ్లీ ఆందోళన బాట పడతామని కవిత హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!