

అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త రికార్డు సృష్టించింది. ఇది చైనా వెలుపల ఒకే ప్రాంతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవచ్చని సంస్థ వెల్లడించింది.
కేవలం 10 నెలల్లోనే ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ఇందులో భాగంగా మార్చిలోనే 1.37 గిగావాట్ అవర్ సామర్థ్యాన్ని ప్రారంభించి, మిగిలిన భాగాన్ని జోడించి మొత్తం 3.37 గిగావాట్ అవర్‌కు చేర్చారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపిన వివరాల ప్రకారం, సౌర మరియు పవన శక్తితో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ ఉంచి అవసరమైనప్పుడు వినియోగించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఆధునాతన లిథియం అయాన్ బ్యాటరీలతో నిర్మించిన ఈ వ్యవస్థ దేశ ఇంధన రంగంలో స్వావలంబనను పెంచడమే కాకుండా సుస్థిరతకు దోహదం చేస్తుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!