

డ్రగ్స్ రాకెట్ కేసులో పంజాబీ సింగర్ హర్బీర్ సింగ్ సోహాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో హెరాయిన్ తరలిస్తున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కారు నుంచి సుమారు 5.1 కేజీల హెరాయిన్‌తో పాటు రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఖన్నా ఎస్ఎస్‌పీ దర్పన్ అహ్లువాలియా తెలిపిన వివరాల ప్రకారం, హర్బీర్ అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై నెట్‌వర్క్‌లో కొరియర్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో ఆస్ట్రేలియా, కెనడా నుంచి వచ్చిన డ్రగ్స్‌ను స్థానిక సరఫరాదారులకు చేరవేస్తున్నట్టు వెల్లడైంది. ఇటీవల డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన అక్షయ్ కుమార్ విచారణలో హర్బీర్ పేరు బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హర్బీర్‌పై గతంలో కూడా ఎక్స్‌టార్షన్ కేసులు నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!