

క్రిస్టోఫ్ ఒలాహ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో భారీ స్థాయిలో మానవ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. పోప్ లియో XIV ఆధ్వర్యంలో మే 25న వాటికన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఉపాధి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని అన్నారు. AI కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వారికి మద్దతు ఇవ్వడం భవిష్యత్తులో పెద్ద సామాజిక బాధ్యతగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోప్ తన తొలి ప్రధాన ఎన్‌సైక్లికల్ “Magnifica Humanitas”ను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా పోప్ లియో XIV AI కంపెనీలపై కఠిన నియంత్రణ అవసరమని, డిజిటల్ ప్రపంచంలో అధికారం కేంద్రీకరణ ప్రమాదకరమని హెచ్చరించారు. AI సంస్థలు వ్యాపార పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నాయని ఒలాహ్ పేర్కొన్నారు. అలాగే AIపై చర్చలు కేవలం టెక్ కంపెనీలకే పరిమితం కాకుండా ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, మతపరమైన సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో చర్చి మరియు ఆంథ్రోపిక్ కలిసి మానవాళికి ఉపయోగపడే AI అభివృద్ధిపై పనిచేయవచ్చని పోప్ సంకేతాలు ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!