

కవిత మంగళవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ను కలిసి వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ బాధితులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, బాధితులు, తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి రాజ్ భవన్‌లో సమావేశమైన కవిత.. రాష్ట్రంలోని భూసేకరణ సమస్యలు, నిర్వాసితుల ఆందోళనలు గవర్నర్‌కు వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రక్షణ సేన చేపట్టిన పోరాటాల ఫలితంగానే వెలుగుమట్ల బాధితులకు అదే ప్రాంతంలో భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, పరిగి, ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో భూసేకరణను తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!