

పసునూరి నరహరి అనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తన భార్య దానమ్మతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. మీడియా సమావేశంలో నరహరిని ప్రవేశపెట్టిన డీజీపీ.. ఈ లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు మరో భారీ ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందిన నరహరి.. డిగ్రీ చదువుతున్న సమయంలోనే 1982లో మావోయిస్టు ఉద్యమంలో చేరి, 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగినట్లు తెలిపారు.
తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో నరహరి నిపుణుడని పోలీసులు వెల్లడించారు. ఆయుధాల తయారీ, మరమ్మతులు, నిర్వహణలో మావోయిస్టు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న తెలంగాణకు చెందిన గణపతి, జాడే సుజాత, వార్త శేఖర్ వంటి నేతలు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస సాయం అందిస్తోందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!