

కృత్రిమ మేధ (AI)ను ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు ఇప్పుడు AI టూల్స్ వినియోగంపై భారీగా దృష్టిసారిస్తున్నాయి. తొలుత ఈ టెక్నాలజీపై సంకోచం చూపిన ఆర్థిక సంస్థలు.. ప్రస్తుతం పోటీలో నిలవాలంటే AI అవసరమని గుర్తించి ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్ అనే సంస్థ ఈ విషయంలో విశేష గుర్తింపు పొందింది. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్ క్లాడ్, గూగుల్ జెమినై వంటి AI సాధనాలను ఆర్థిక కార్యకలాపాల్లో సమర్థవంతంగా వినియోగించడంపై ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది.
2025లో మాజీ సాఫ్ట్‌బ్యాంక్ ఉద్యోగులు ఫెలిపే సినిస్టెర్రా, డేవ్ వాంగ్‌లు స్థాపించిన ఈ సంస్థ ఒక్కో ట్రైనింగ్ సెషన్‌కు దాదాపు 25 వేల డాలర్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సిటీగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ ట్రైనింగ్ సేవలు వినియోగిస్తున్నాయి. మరోవైపు AI విస్తరణతో స్టాండర్డ్ చార్టర్డ్, వెల్స్ ఫార్గో వంటి కంపెనీలు సంప్రదాయ ఉద్యోగాల్లో కోతలకు సిద్ధమవుతున్నాయి. IMF AI ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ ప్రకారం సింగపూర్ ప్రపంచంలో తొలి స్థానంలో ఉండగా, ఆసియా మార్కెట్లపై కూడా వాల్‌స్ట్రీట్ ప్రాంప్ట్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!