

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సినీ పరిశ్రమకు భారీ ఊరట కలిగించే కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై కొత్తగా విడుదలయ్యే సినిమాలకు తొలి వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. గతంలో 1957 నుంచి అమల్లో ఉన్న తమిళనాడు సినిమా నియంత్రణ నిబంధనల ప్రకారం రోజుకు నాలుగు షోలకే పరిమితి ఉండేది. అదనపు షో కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఐదో షో నిర్వహించే అవకాశం లభించింది.
ఈ నిర్ణయం వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్, డబ్బింగ్ సినిమాలు, రీ-రిలీజ్ చిత్రాలు, పిల్లల సినిమాలకు కూడా వర్తించనుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పోటీ, పైరసీ ప్రభావంతో థియేటర్ల ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జరిగిన సమావేశాల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమ వర్గాలు, థియేటర్ యజమానులు, అభిమానులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమిళ సినీ రంగానికి ఇది పెద్ద బూస్ట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!