

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా పాటలకు ఏమాత్రం తగ్గకుండా జానపద గీతాలు మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పలువురు మేకర్స్, సినీ సెలబ్రిటీలు కూడా ఫోక్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అలాంటి సూపర్ హిట్ పాటల్లో జరీ జరీ పంచె కట్టి ఒకటి. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఇందులో యాంకర్, నటి విష్ణు ప్రియా తో పాటు టీవీ నటుడు మానస్ అదిరిపోయే డాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం రాశారు. శ్రావణ భార్గవి, సాకేత్, స్పూర్తి జితేంద్ర ఆలపించిన ఈ పాటకు మదీన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ 75 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!