

డెల్ టెక్నాలజీస్ లో ఇన్నోవేషన్ అండ్ ఎకోసిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సతీష్ అయ్యర్.. భారతదేశం అభివృద్ధి చేస్తున్న సావరిన్ AI వ్యవస్థలు అమెరికా, చైనాలకు పోటీగా నిలవగలవని అభిప్రాయపడ్డారు. లాస్ వేగాస్‌లో జరిగిన డెల్ టెక్నాలజీస్ వరల్డ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారతీయ భాషలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించే AI మోడల్స్‌నే భవిష్యత్తులో నిజమైన బలంగా ప్రపంచం గుర్తిస్తుందని అన్నారు.
ఫ్రంట్ియర్ AI మోడల్స్ కంటే ప్రాంతీయ అవసరాలకు తగ్గట్టుగా పనిచేసే AI వ్యవస్థలకే మార్కెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని సతీష్ అయ్యర్ పేర్కొన్నారు. సెర్చ్ ఇంజిన్లు, బ్రౌజర్ల ఉదాహరణ ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్లాట్‌ఫామ్ ఆధిపత్యం కొనసాగినా, ప్రతి ప్రాంతంలో స్థానిక అవసరాలకు తగ్గ సొల్యూషన్లకే ప్రజలు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. భారతదేశ భాషా వైవిధ్యం, సంస్కృతి, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే సావరిన్ AI మోడల్స్ దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురాగలవని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!