

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ నేత తిరుమాని వెంకటరాజుపై ఓ మైనర్ బాలిక తీవ్ర ఆరోపణలు చేసింది. తన తల్లి ఒత్తిడితో ఆయనతో ఉండాల్సి వచ్చిందని, రాజకీయ ప్రభావం వల్ల తనపై ఎవరూ చర్యలు తీసుకోలేరని వెంకటరాజు బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది.
బాధితురాలి ప్రకారం, గత కొంతకాలంగా తన తల్లి మరియు వెంకటరాజు మధ్య సంబంధం ఉండటంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని తెలిపింది. గత నెల రోజులుగా ఇంట్లో మద్యం సేవిస్తూ తనపై మానసిక ఒత్తిడి తెచ్చారని, తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించింది. తీవ్ర మనోవేదనకు గురై గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు కాపాడినట్లు సమాచారం. అనంతరం నరసాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లభించలేదని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు, బాలల హక్కుల కార్యకర్తలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!