
జనరల్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కీలక దశకు చేరినట్లు సమాచారం. యూకే కోర్టులు, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో తన అప్పగింతను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురికావడంతో యూకే ప్రభుత్వం అధికారిక అప్పగింత ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం, మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2019 మార్చి నుంచి లండన్ జైలులో ఉన్న ఆయనను భారత్‌కు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో అప్పగింత ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!