
జనరల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ మరింత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో సామర్థ్యాన్ని పెంపొందించడం, ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులను సమర్థంగా నిర్వహించడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2.1 శాతం.
ప్రస్తుత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏఐపై టెక్ కంపెనీల వ్యయం సుమారు 700 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా. ఈ భారీ పెట్టుబడులకు తగిన రాబడులు సాధించాలనే ఒత్తిడి సంస్థలపై పెరుగుతోంది. ఇదే సమయంలో వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ వినియోగం పెరగడంతో మానవ వనరుల అవసరం కూడా తగ్గుతోంది. మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్, మెటా వంటి ప్రముఖ టెక్ కంపెనీలు కూడా ఈ ఏడాది వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!