
టెక్నాలజీ

ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించడంతో పాటు తల్లి, శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు రూ.5,000 నగదు ప్రోత్సాహకం అందించనుంది. అలాగే ప్రతి జిల్లాలో అర్హత కలిగిన మూడు జంటలకు ప్రత్యేకంగా రూ.5,000 బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదేవిధంగా కాన్పుల మధ్య కనీసం రెండేళ్ల విరామం పాటించిన దంపతులకు కూడా రూ.5,000 ప్రోత్సాహకం అందించనుంది. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.56 లక్షలు విడుదల చేసింది. జూలై 11 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!